మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 06:14:13

పంట‌ల న‌మోదుకు 31వరకు గ‌డువు

పంట‌ల న‌మోదుకు 31వరకు గ‌డువు

హైద‌రా‌బాద్: ఏయే పంటలు ఎంత విస్తీ‌ర్ణంలో వేశా‌రనే వివ‌రా‌లను ఈ నెల 31 వరకు వ్యవ‌సాయ విస్త‌రణ అధి‌కా‌రుల (ఏ‌ఈవో) వద్ద నమోదు చేసు‌కో‌వా‌లని రైతు‌లకు వ్యవ‌సా‌య‌శాఖ సూచిం‌చింది. తద్వారా పంట కొను‌గో‌లులో ఇబ్బం‌దు‌లను అధి‌గ‌మిం‌చ‌వ‌చ్చని వ్య‌వ‌సాయ‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్‌రెడ్డి తెలిపారు. రైతులు తమ పంటల వివ‌రా‌లను వెల్ల‌డిం‌చడం వల్ల రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీ‌ర్ణంలో ఉన్నది, దిగు‌బడి ఎంత వస్తుం‌దనే లెక్కలు పక్కాగా ఉంటా‌యన్నారు. 

దీనికి సంబంధించి రైతు సెల్‌ఫోన్‌కు ఎస్ఎమ్మెస్‌లు పంపించామ‌ని వెల్ల‌డించారు. ఈ వివ‌రాల ఆధారంగా వ‌చ్చే అక్టోబ‌ర్ నుంచి వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లో పంట‌ల‌ను మ‌ద్ద‌తు ధ‌ర‌కు ప్ర‌భుత్వం కొంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. పంట వివ‌రాలు న‌మోదుచేయించ‌క‌పోతే దానిని మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనేదిలేద‌ని చెప్పారు. 


logo