బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 16:00:00

రాజేంద్ర‌న‌గ‌ర్ వ‌ద్ద మూసీలో మొస‌ళ్ల క‌ల‌క‌లం

రాజేంద్ర‌న‌గ‌ర్ వ‌ద్ద మూసీలో మొస‌ళ్ల క‌ల‌క‌లం

రంగారెడ్డి : రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హైద‌ర్‌గూడ వ‌ద్ద మూసీ వాగులో మొస‌లి క‌నిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై నెహ్రూ జూ పార్కు సిబ్బందికి స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న పార్కు సిబ్బంది.. మొస‌లిని ప‌ట్టుకునేందుకు య‌త్నించ‌గా నీటి లోప‌లికి వెళ్లిపోయింది. గ‌త వారం రోజుల్లో మొస‌లి క‌నిపించ‌డం ఇది రెండోసారి అని స్థానికులు తెలిపారు. హిమాయ‌త్‌సాగ‌ర్ వ‌ర‌ద గేట్లు తెరిచిన త‌ర్వాత మూసీలో మొస‌ళ్లు క‌నిపిస్తున్నాయ‌ని స్థానికులు పేర్కొన్నారు. అయితే మొస‌ళ్లు నీటి నుంచి బ‌య‌ట‌కువ స్తున్న క్ర‌మంలో అటు మూసీ వైపు ప్ర‌జ‌లెవ‌రూ వెళ్లొద్ద‌ని పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.