గురువారం 26 నవంబర్ 2020
Telangana - Sep 18, 2020 , 01:24:41

మూసీ నీటిలో మొసలి

మూసీ నీటిలో మొసలి

చార్మినార్‌: రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హైదరాబాద్‌ హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల్లోని కాల్వనీటిలో జీవిస్తున్న మొసళ్లు వరదనీటిలో కొట్టుకొస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం మూసీ వరదనీటి కాలువల్లో మొసలిని స్థానికులు గుర్తించారు. వెంటనే బహదూర్‌పుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొసలిని గుర్తించిన పోలీసులు దానిని బంధించడానికి జూపార్క్‌ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న జూపార్క్‌ రెస్క్యూ టీం సభ్యులు.. మొసలిని బంధించడానికి ప్రయత్నించారు. వరద ఉధృతి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించలేకపోతున్నామని జూ అధికారులు తెలిపారు.