శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 22:24:20

చెరువులో మొసలి మృతి

చెరువులో మొసలి మృతి

మల్లాపూర్‌: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువు వద్ద శనివారం వేకువజామున ఓ మొసలి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చెరువులో నుంచి బయటకువచ్చిన మొసలిని పశువుల కాపరులు గమనించారు. ఎంతసేపైనా మొసలి కదలక పోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచారు. అటవీశాఖ అధికారులు పరిశీలించిన మొసలి మృతి చెందిదని, పశువైద్యాధికారులతో కలిసి పంచనామా నిర్వహించి ఖననం చేసినట్లు ఇన్‌చార్జి ఎఫ్‌ఎస్‌ఓ రంజిత్‌, బీట్‌ అధికారి మౌనిక తెలిపారు. 


logo