ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 15:30:28

సీపీఐ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్ క‌న్నుమూత‌

సీపీఐ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్ క‌న్నుమూత‌

హైద‌రాబాద్ : సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్(75) క‌న్నుమూశారు. గ‌త‌కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మాజీ ఎమ్మెల్యే మ‌ల్లేశ్‌.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మ‌ల్లేశ్ మృతిప‌ట్ల సీపీఐ పార్టీ నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం గుండా మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని నారాయ‌ణ‌గూడ‌లోని మ‌క్దూమ్ భ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు. అనంత‌రం మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని బెల్లంప‌ల్లికి త‌ర‌లించ‌నున్నారు. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ల్లేశ్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 


logo