గురువారం 28 మే 2020
Telangana - May 07, 2020 , 18:09:45

పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను పెంపు దారుణం: నారాయణ

పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను పెంపు దారుణం: నారాయణ

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచి ప్రజలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషాతో కలిసి గురువారం ఆయన మగ్దూంభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతుంటే కేంద్రం  పెట్రో భారం మోపడం దారుణమన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలను, వలసకార్మికులను ఆదుకోవడంలో కేంద్రం ఘోరంగా  విఫలమైందని దుయ్యబట్టారు. కష్టకాలంలో రాష్ట్రాలకు నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. మద్యం అమ్మకాలకు మాత్రం అనుమతించిందని, దీంతో 40 రోజుల లాక్‌డౌన్‌లో ప్రజలు పడిన కష్టాలన్నీ వృథా అయ్యాయని పేర్కొన్నారు. 


logo