శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 14:49:04

'బ‌క్కాయ‌న‌పై ఇంత‌మంది కాషాయ బా‌హుబ‌లులా'

'బ‌క్కాయ‌న‌పై ఇంత‌మంది కాషాయ బా‌హుబ‌లులా'

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం మొత్తం క్యూ క‌ట్ట‌డంపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కె. నారాయ‌ణ స్పందించారు. ఒక బ‌క్కాయ‌న‌ను ఎదుర్కొనేందుకు ఇంత‌మంది కాషాయ బా‌హుబ‌లులు రంగంలోకి దిగారన్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి న‌గ‌రానికి విచ్చేస్తున్న బీజేపీ నాయ‌కుల తీరుపై ఆయ‌న స్పందించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ట్టు లేదు.. రాష్ర్ట ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ట్లుగా ఉంద‌న్నారు. 

నిన్న కొవిడ్ సెంటిమెంట్, ఈరోజు రిలీజియ‌స్ సెంటిమెంట్స్ ను అనైతిక రాజకీయ విన్యాసాలతో దేశప్రధాని మోదీ, హోంత్రి అమిత్‌షా బరితెగించారంటే లౌకిక నీతిసూత్రాలను వెక్కిరించడమేగదా అన్నారు. ఒకవైపు కోట్లాది మంది రైతాంగం అగ్గిపై నుంచొని ప్రాణాలకు తెగించి బారికేడ్ల‌ను తోసి, క‌రోనా మహమ్మారిని లెక్కచేయక ఢిల్లీని ఆక్రమించారు. వారికి సమాదానం చెప్పలేని మోడిప్రభుత్వం నేలవిడచి సాముచేస్తూ హైద్రబాద్ రాజకీయ వలస బాటపట్టారన్నారు. బీజేపీ ఢిల్లీలో పారేసుకున్న సూదిని హైద్రాబాద్‌లో వెతుక్కుంటుంద‌న్నారు. బీజేపీకి న‌గ‌ర ఓట‌ర్లు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌న్నారు. లౌకికశక్తులు పునరాలోంచించుకునే తరుణం ఆసన్నమైంద‌న్నారు. 


logo