శనివారం 04 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:00:17

పేదల కరెంటు బిల్లు కాజేశారు

పేదల కరెంటు బిల్లు  కాజేశారు

  • ఇంటికి రూ.300 వసూలుచేసిన సీపీఐ నాయకులు
  • సీపీఐ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా

ఖిలావరంగల్‌: ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకునే కమ్యూనిస్టు నాయకులు పేదల కరెంటు బిల్లుల్ని కాజేశారు. వరంగల్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలోని ఎల్‌వీఆర్‌నగర్‌లో 183 పేదకుటుంబాలు ఆరేండ్ల క్రితం గుడిసె లు వేసుకొన్నాయి. ఇంటి నంబరు లేనికారణంగా కరంట్‌ కనెక్షన్‌ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. దీంతో వీరందరికీ మొత్తంగా ఓ ప్రాంతం నుంచి విద్యుత్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో బిల్లుల పేరిట సీపీఐ శాఖ కార్యదర్శి నెలకు ఒక్కో గుడిసె నుంచి రూ.300 వసూలుచేశాడు. మీటరు ఇప్పిస్తామని రూ.1500 చొప్పున రూ.5 లక్షల దాకా వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడు. బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు కరంట్‌సరఫరా నిలిపేశారు. డబ్బుల గురించి సదరు నాయకుడిని అడిగితే గుడిసెలు ఖాళీ చేయిస్తామని బెదిరిస్తున్నాడు.  దీంతో కాలనీవాసులంతా ఏకమై శివనగర్‌లోని తమ్మెరభవన్‌(సీపీఐ కార్యాలయం)ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఐ శాఖ కార్యదర్శి సుదర్శన్‌, ఇతర నాయకులకు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


logo