మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 07:38:22

పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

సిద్దిపేట : దుబ్బాక పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ఉదయం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.