శనివారం 29 ఫిబ్రవరి 2020
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సీపీ సజ్జనార్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సీపీ సజ్జనార్‌

Feb 14, 2020 , 15:56:57
PRINT
 గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సీపీ సజ్జనార్‌

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.   ఇందులో భాగంగా మామిడి, సపోటా, జామ చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ముందుగా కార్యక్రమంలో పల్గొన్న పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు.   పర్యావరణహితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు  ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతీ ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలి. నాటిన మొక్కలను కనీసం మూడు నెలలైనా కాపాడాలి. అలాగే మరో ముగ్గిరికి మొక్కలు నాటేందుకు నామినేట్ చేయాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పట్టడం జరిగిందన్నారు. हरा है तोह भरा है (Hara hai toh Bhara hai! ). అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 99టీవీ  యాంకర్ రోజా తనకు, [email protected]సజ్జనార్ సీపీ సైబరాబాద్,  [email protected]రఘుకుంచె ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, [email protected]సంపూర్ణేష్ బాబు నటుడు, [email protected]జర్నలిస్ట్ స్వప్న, [email protected]హైపర్ ఆది కి విసిరిన ఛాలెంజ్ లో భాగంగా సైబరాబాద్ సీపీ ఆఫీసు ఆవరణలో ఈరోజు మొక్కలు నాటామని తెలిపారు.

అలాగే నేను మరో  మరో 15 మందిని నామినేట్ చేస్తున్నానని పేర్కొన్నారు. అరిజిత్ సర్కార్ గూగుల్ వీపీ, విజయ్ కేసనపల్లి సెంటర్ హెడ్ విప్రో, రఘు బొడ్డుపల్లి సెంటర్ హెడ్ ఇన్ఫోసిస్, రాజన్న వీపీ టీసీఎస్, శివానంద్ డైరెక్టర్ టెక్ మహింద్రా, ప్రశాంత్ నల్లెడ సెంటర్ హెడ్ కాగ్నిజెంట్, రాజీవ్ కుమార్ ఎండీ ఐడీసీ మైక్రోసాఫ్ట్, లక్ష్మీకాంత్ ఎండీ,  రమేశ్ ఖాజా ఎండీ స్టేట్ స్ట్రీట్, శివారెడ్డి డైరెక్టర్ క్వాల్ కామ్, శ్రీధర్ సెంటర్ హెడ్ విల్స్ ఫార్గో, ఇసాక్ రాజ్ కుమార్ ఎండీ ఒపెన్ టెక్స్, నర్సింహాచారి సెక్రటరీ టీఎస్ అసెంబ్లీ, ప్రకాశ్ బోండ్ల యూటీఎస్ సెంటర్ హెడ్, వెంకట్ హెడ్ ఆఫ్ ఫాస్ట్ సెట్ లకు మొక్కలు నాటాలని నామినేట్ చేశారు. పర్యావరణ హితం, మానవాళి మనుగడ కోసం ప్రతీఒక్కరూ మొక్కలను నాటలని సీపీ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం అనేది ఒక నిరంతర ప్రక్రియ కావాలన్నారు. 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భారతదేశం, తెలంగాణలోని అన్నిమూలలకు వ్యాపించాలని ఆకాంక్షించారు. మొక్కలు నాటడం అనేది ఒక ఉద్యమం లా వ్యాపించాలన్నారు. గిఫ్ట్ లకు బదులుగా మొక్కలను బహూకరించడం మంచిదన్నారు.  విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పర్యావరణం, మొక్కల ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులు, గురువులు చెప్పడం ఉత్తమమన్నారు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం.  ఈ నెల 17వ  తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు 66 వ పుట్టినరోజు సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అన్ని డీసీపీ కార్యాలయాలు, ఏసీపీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. అలాగే తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు Each one – Plant one, అలాగే దీనికి కొనసాగింపుగా తెలంగాణ  డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి  పిలుపు మేరకు  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పని చేస్తున్న ప్రతీ ఒక్క పోలీస్ సిబ్బంది ఈ నెల  17 వ తేదీన కనీసం ఒక మొక్కనైనా నాటలన్నారు.అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్  రాఘవ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన సీపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 17 వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. కార్యక్రమంలో గ్రీన్ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, ఏడీసీపీ క్రైమ్స్ కవిత, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఏసీపీ సంతోష్ కుమార్, ఆర్ ఐ లు మట్టయ్య, హిమకర్, విష్ణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


logo