మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 07:00:05

సీపీగేట్‌ దరఖాస్తు గడువు పెంపు

సీపీగేట్‌ దరఖాస్తు గడువు పెంపు

హైద‌రా‌బాద్ : ఉస్మా‌నియా, కాక‌తీయ, తెలం‌గాణ, పాల‌మూరు, మహా‌త్మా‌గాంధీ, శాత‌వా‌హన, జేఎ‌న్టీ‌యూ‌హెచ్‌ వర్సి‌టీల పరి‌ధిలో పీజీ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించే రాష్ట్రస్థాయి కామన్‌ పోస్టు గ్రాడ్యు‌యేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీ‌పీ‌గెట్‌–2020) దర‌ఖా‌స్తుల గడువు తేదీని ఈ నెల 23 వరకు పొడి‌గిం‌చి‌నట్టు కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ ఎన్‌ కిషన్‌ తెలి‌పారు. రూ.500 ఆలస్య రుసుంతో ఈ నెల 29 వరకు, రూ.2000 ఆలస్య రుసుంతో నవం‌బర్‌ 2వ తేదీ వరకు దర‌ఖాస్తు చేసు‌కో‌వ‌చ్చని పేర్కొ‌న్నారు. నవం‌బర్‌ ఆరో‌తేదీ నుంచి ఈ ప్రవేశ పరీ‌క్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.