ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 11:28:56

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. జోన్ల‌వారీగా ఐపీఎస్‌ల‌కు బాధ్య‌త‌లు

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. జోన్ల‌వారీగా ఐపీఎస్‌ల‌కు బాధ్య‌త‌లు

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు న‌గ‌ర‌ పోలీసులు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా పూర్త‌య్యేందుకు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా న‌గ‌రంలోని జోన్ల వారీగా పోలీసు ఉన్న‌తాధికారుల‌కు సీపీ అంజ‌నీకుమార్‌ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తూర్పు మండ‌లం ఇన్‌చార్జి‌గా షికా గోయ‌ల్‌, ప‌శ్చిమ మండ‌ల ఇన్‌చార్జిగా అనిల్ కుమార్‌, సౌత్ జోన్ ఇన్‌చార్జిగా డీఎస్ చౌహాన్‌, మ‌ధ్య మండ‌ల ఇన్‌చార్జిగా త‌రుణ్ జోషి, తూర్పు మండ‌లం ఇన్‌చార్జిగా అవినాశ్ మ‌హంతిని నియ‌మించారు. అధికారులు  త‌మ ప‌రిధిలోని పోలింగ్, లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను త‌నిఖీ చేయ‌నున్నారు. ఎన్నికల సంద‌ర్భంగా ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యాల‌పై డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.