బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 08:53:25

'కొవిషీల్డ్' ఎక్స్‌పైరీ తేదీ ఎప్ప‌టి వ‌ర‌కో తెలుసా?

'కొవిషీల్డ్' ఎక్స్‌పైరీ తేదీ ఎప్ప‌టి వ‌ర‌కో తెలుసా?

హైద‌రాబాద్ : ప‌్ర‌తి మెడిసిన్‌, ఇంజ‌క్ష‌న్‌పై వాటి త‌యారీ తేదీ, కాల‌ప‌రిమితి ముగిసే తేదీ(ఎక్స్‌పైరీ డేటు)తో పాటు బ్యాచ్ నంబ‌ర్‌ను క‌చ్చితంగా ముద్రిస్తారు. ఈ తేదీల‌ను చూసిన త‌ర్వాతే మెడిసిన్స్‌, ఇంజ‌క్ష‌న్స్‌ను కొనుగోలు చేస్తారు. ఎందుకంటే కాల‌ప‌రిమితి ముగిసిన మెడిసిన్స్‌ను వాడితే ఆరోగ్యానికి ప్ర‌మాదక‌రం. కాబ‌ట్టి ఆ తేదీల‌ను నిశితంగా ప‌రిశీలించిన త‌ర్వాతే.. ఆ మెడిసిన్స్‌ను ఉపయోగిస్తాం. 

అయితే క‌రోనా నివార‌ణ‌కు సీరం ఇన్‌స్టిట్యూట్‌ త‌యారు చేసిన కొవిషీల్డ్ టీకా అందుబాటులోకి వ‌చ్చింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేష‌న్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్టానికి 3.64 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ నిన్న చేరింది. దీంతో ఆ టీకాను ఎప్పుడు తయారు చేశారు? ఎప్ప‌టి వ‌ర‌కు దాని కాల‌ప‌రిమితి? ఒక్కో టీకా ప‌రిమాణం ఎంత‌? అనే అంశాల‌పై జ‌నాలు ఆస‌క్తి చూపుతున్నారు. ఆ టీకాను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు.

కొవిషీల్డ్ టీకాను 2020, న‌వంబ‌ర్ 1వ తేదీన సీరం ఇన్‌స్టిట్యూట్ త‌యారు చేసింది. ఈ టీకా కాల‌ప‌రిమితి 2021, మార్చి 29వ తేదీ వ‌ర‌కు ఉంటుంది. మొత్తం 31 బాక్సుల్లో నిల్వ చేసిన 3.64 ల‌క్ష‌ల డోసులు కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోర్‌లో నిల్వ ఉంచారు. ఒక్కో బాక్సులో 1200 వ‌య‌ల్స్ ఉండ‌గా, ఒక్కో వ‌య‌ల్‌లో 5 ఎంఎల్ ప‌రిమాణం టీకా ఉండ‌గా.. దానిని 10 డోసులుగా వేస్తారు. ఈ టీకాను పోలీసుల భ‌ద్ర‌త న‌డుమ వ్యాక్సిన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లిస్తున్నారు.


logo