గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 12:14:38

నిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

నిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. ఇద్దరు వాలంటీర్లకు కొవాగ్జిన్‌ అనే వ్యాక్సిన్‌ను నిమ్స్‌ వైద్యులు ఇచ్చారు. స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ రూపొందించింది. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌' పేరిట టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ వ్యాక్సిన్‌పై మొదటి, రెండో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు ఇండియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ అనుమతులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 375 మంది వలంటీర్లపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్టు సంస్థ శుక్రవారం ప్రకటించింది.


logo