శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 13:10:01

భూమా అఖిల‌ప్రియ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

భూమా అఖిల‌ప్రియ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

హైద‌రాబాద్ : బోయిన్‌ప‌ల్లికి చెందిన ప్ర‌వీణ్ రావు సోద‌రుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. మూడు రోజుల పాటు కోర్టు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇవ్వ‌డంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఆమెను ప‌లు అంశాల‌పై విచారించి స‌మాధానాలు రాబ‌ట్టారు. ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. క‌స్ట‌డీ ముగియ‌డంతో గురువారం ఉద‌యం ఆమెకు బేగంపేట పీహెచ్‌సీలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వైద్య‌ప‌రీక్ష‌ల కోసం అక్క‌డ్నుంచి అఖిల‌ప్రియ‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్య‌ప‌రీక్ష‌లు ముగిసిన అనంత‌రం అఖిల‌ప్రియ‌ను న్యాయ‌మూర్తి ఎదుట పోలీసులు హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. అనంత‌రం చంచ‌ల్‌గూడ మ‌హిళా జైలుకు త‌ర‌లించ‌నున్నారు.