చైల్డ్‌కేర్ సంస్థల్లో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కొవిడ్ కిట్లను శుక్రవారం పంపిణీ చేసింది. కిట్‌లో ఎలక్ట్రిక్ కెటిల్, పల్స్ ఆక్సీమీటర్, వేపొరైజర్, శానిటైజర్, క్లాత్ మాస్క్‌లు, ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లతోపాటు పలు వస్తువులు ఉంటాయి. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్, డీఎల్ఎస్ఏ కారదర్శి ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం హెల్ప్‌లైన్ నంబర్ 14567, వికలాంగుల సహాయార్థం 08046110007 నంబర్‌తో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ