గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:33

ఎంజీఎంలో 500 బెడ్లతో కొవిడ్‌ బ్లాక్‌

ఎంజీఎంలో 500 బెడ్లతో కొవిడ్‌ బ్లాక్‌

  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల

వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఎంజీఎం దవాఖానను 500 పడకల కొవిడ్‌ వార్డుగా మారుస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు, ఎంజీఎం ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఈటల హన్మకొండలో సమీక్షించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంపగలిగే స్థాయిలో కరోనా లేదని, ఎవరూ ఆందోళన చెందద్దొన్నారు. ఎటువంటి లక్షణాలు లేకుండా 81 శాతం మందికి కరోనా వచ్చిపోతుందని, 19 శాతం మందికే లక్షణాలు ఉంటున్నాయని చెప్పారు. 

హితం యాప్‌తో కరోనా బాధితులకు సేవలు..

కరోనా బాధితులకు సేవలు అందించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హితం యాప్‌ను రూపొందించిందని మంత్రి ఈటల తెలిపారు.  తమ ఆరోగ్య సమస్యలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ఈ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ వైద్యులే కాకుండా ఔత్సాహిక వైద్యులు సైతం కరోనా బాధితులకు ఆరోగ్యసేవలు అందిస్తారన్నారు.


logo