శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 07, 2020 , 00:59:10

హైదరాబాద్‌లో కొవిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు

హైదరాబాద్‌లో కొవిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 70 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేటి నుంచి కొవిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇవి కరోనా నిర్ధారణ పరీక్షలు కావని, కేవలం హైరిస్కు రోగులలో వైరస్‌ స్థితిగతులను అంచనా వేయడానికి నిర్వహిస్తున్నట్లు మేడ్చల్‌ జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ ఎస్డీ రామ్‌కుమార్‌ చెప్పారు. గర్భిణులు, కొవిడ్‌ పాజిటివ్‌ రోగులతో దగ్గరి సంబంధాలు కలిగిన ప్రైమరీ కాంటాక్ట్‌, గుండె, కిడ్నీవంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలున్న హైరిస్క్‌ రోగులకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్‌ రామ్‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ నిర్ధారణ (పీసీఆర్‌) పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి కొవిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే వారికి వైరస్‌ వచ్చిపోయినట్లని, ఆ రెండు పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే వారిలో వైరస్‌ ఇంకా ఉన్నట్లని ఆయన వివరించారు. పీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చి, యాంటీజెన్‌లో పాజిటివ్‌ వచ్చిన రోగిలో యాంటీబాడీస్‌ తయారైనట్లుగా భావించాలని ఆయన తెలిపారు. రిసెర్చ్‌లో భాగంగానే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.  హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 50 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మేడ్చల్‌ పరిధిలో 20 కేంద్రాలలో నేటి నుంచి ఈ పరీక్షలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు.logo