ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 01:27:09

హ్యూమన్‌ ట్రయల్స్‌లో కొవిడ్‌-19 టీకా!

హ్యూమన్‌ ట్రయల్స్‌లో కొవిడ్‌-19 టీకా!

108 మందిపై ప్రయోగించిన చైనా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19కు టీకాను కనుగొనే పనిలో చైనా శాస్త్రవేత్తలు.. మానవులపై ప్రయోగాలు ప్రారంభించారు. వైరస్‌ పుట్టినిల్లయిన వుహాన్‌లో జరిపిన మానవ పరిశోధనల్లో ఈ టీకా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సభ్యురాలు చిన్‌వీ తెలిపారు. అధికారిక అనుమతులతో గత నెల 16న టీకా తొలిదశ ప్రయోగాలు మొదలయ్యాయని చెప్పారు. 18-60 ఏండ్ల మధ్యవయసున్న 108 మందిపై ప్రయోగించామన్నారు. అందులో సంతృప్తికర ఫలితాలు వచ్చాయన్నారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఈ నెలలోనే ప్రచురిస్తామని తెలిపారు. త్వరలో విదేశాల్లో అదనపు ట్రయల్స్‌ నిర్వహిస్తామన్నారు. ప్రపంచదేశాలు కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్నాయని, తమ ప్రయోగాలకు అంతర్జాతీయంగా సహకారాన్ని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ టీకాతో ప్రపంచంలో కొవిడ్‌-19కు ముగింపు దొరుకుతుందని, అయితే పూర్తి అనుమతులు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందనేది చెప్పలేమన్నారు. logo