గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 01:53:51

లక్షన్నర మంది రికవరీ

లక్షన్నర మంది రికవరీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 27,41,836 టెస్టులు నిర్వహించగా, 1,81,627 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 1,50,160 మంది బాధితులు కోలుకున్నారు. మరో 30,387 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రికవరీ రేటు 81.71 శాతం ఉండగా, తెలంగాణలో 82.67 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో గురువారం 57,621 మందికి టెస్టులు నిర్వహించగా, 2,381 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. జీహెచ్‌ఎంసీలోనే 386 కేసులు కాగా, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
గురువారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,381
1,81,627
డిశ్చార్జి  
2,021
1,50,160
మరణాలు
10
1,080
చికిత్స పొందుతున్నవారు
-
30,387
logo