ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:34

80 శాతం కోలుకున్నారు

80 శాతం కోలుకున్నారు

  • ఆదివారం 2,479 మంది డిశ్చార్జి
  • తాజాగా 1,417 మందికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సకాలంలో చికిత్స అందిస్తుండటంతో రికవరీ రేటు రికార్డుస్థాయికి చేరుకున్నది. ఆదివారం దేశంలో రికవరీ రేటు 77.87% ఉండగా, తెలంగాణలో అత్యధికంగా 80.1 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 21,69,339 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,58,513 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1,27,007 మంది కోలుకున్నారు. మరో 30,532 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు సోమవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. తాజాగా 1,417 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 13 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 974 (0.61%)కు చేరుకున్నది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
ఆదివారంమొత్తం
పాజిటివ్‌ కేసులు
1,417
1,58,513
డిశ్చార్జి
2,479
1,27,007
మరణాలు
13
974
చికిత్స పొందుతున్నవారు
-
30,532
logo