గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:36:11

రికవరీ రేటు 77.9%

రికవరీ రేటు 77.9%

  • 18.90 లక్షల కరోనా పరీక్షలు పూర్తి
  • మంగళవారం కొత్తగా 2,479 కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సకాలంలో చికిత్స అందిస్తుండటంతో రాష్ట్రంలో రికవరీ రేటు 77.9 శాతానికి చేరుకున్నది. ఇప్పటివరకు 1.47 లక్షల మందికి కరోనా సోకగా, అందులో లక్షా 15 వేలమంది దాకా కోలుకున్నారు. మరో 31 వేలమంది ఇంట్లో, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.69% ఉండగా తెలంగాణలో 0.62% గా ఉన్నది. కరోనా నిర్ధారణ పరీక్షలు సైతం వేగంగా జరుగుతున్నాయి. మంగళవారం 62 వేల పరీక్షలు కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో 18.90 లక్షల పరీక్షలు పూర్తిచేసినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం బులెటిన్‌లో పేర్కొన్నది. మంగళవారం 2,479 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిం ది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 322, రంగారెడ్డి జిల్లాలో 188 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌కు తోడు ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా 10 మంది మరణించారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు మంగళవారం మొత్తం

పాజిటివ్‌ కేసులు 2,479 1,47,642

డిశ్చార్జి 2,485 1,15,072

మరణాలు 10 916

చికిత్స పొందుతున్నవారు - 31,654


logo