బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 15:11:44

గోకుల్‌ చాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌

గోకుల్‌ చాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌ : కోఠిలోని గోకుల్‌ చాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. ఇందులో పని చేస్తున్న 19 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. గత మూడు రోజుల నుంచి దుకాణానికి చాట్‌ కోసం వచ్చిన వారి వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14న క్వారంటైన్‌కు తరలివచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో వివరించారు.


logo