శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 16:41:33

తెలంగాణలో కొవిడ్ కాల్ సెంటర్ సేవలు..!

తెలంగాణలో కొవిడ్ కాల్ సెంటర్ సేవలు..!

హైదరాబాద్‌: తెలంగాణ  ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన  కొవిడ్‌-19  కాల్ సెంటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది.  కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం  తెలంగాణ ప్రభుత్వం టెలి మెడిసిన్ సేవలను అందుబాటులోకి  తీసుకువచ్చింది. కరోనా బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటానికి    కాల్ సెంటర్‌ను  ఏర్పాటు చేసింది. 

ఈ కాల్ సెంటర్ ద్వారా పాజిటివ్ వచ్చి ఇంటి వద్దే ఉంటూ  చికిత్స తీసుకుంటున్న వారు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై   కౌన్సిలింగ్ ద్వారా తెలియజేస్తున్నది.  సాధారణ పరిస్థితులలో  రోజు వారిగా 17 రోజుల పాటు   కాల్ సెంటర్  నుంచి ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. పాజిటివ్ వచ్చిన రోగులకు ఇంటి వద్దే ఉంటూ  హోం ఇసోలేషన్‌లో  భాగంగా తీసుకోవాల్సిన  చర్యలు గురించి కౌన్సిలింగ్ ఇస్తోంది.  ఎటువంటి సందేహాలు వచ్చిన 1800 599 4455 కు  కాల్ చేయవచ్చు.   ప్రభుత్వం  ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది.  


logo