గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 01:36:45

ముందు జ్వరం, దగ్గు.. ఆపైఊపిరాడదు

ముందు జ్వరం, దగ్గు.. ఆపైఊపిరాడదు

 -ఇవే కొవిడ్‌-19 లక్షణాలు  

-2 నుంచి 14 రోజుల్లోపు కనిపించొచ్చు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దగ్గుతో బాధపడుతున్నారా? ఒంటిని జ్వరం విడువడం లేదా? ఆయాసం ఎక్కువవుతున్నదా? అయితే అప్రమత్తం కండి. ఇవన్నీ కరోనా వైరస్‌ లక్షణాలని గుర్తించండి. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారిలో ముఖ్యంగా దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉండవు. కరోనా వైరస్‌ సోకినవారిలో వ్యాధి లక్షణాలు కనిపించేందుకు 2 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. లక్షణాలు బయటపడేందుకు పట్టే సమయం సగటున 5 రోజులని చైనాలో జరిపిన ఓ పరిశోధనలో తేలింది.

వైరస్‌ సోకిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు

  • 1 నుంచి 3 రోజులు.. మొదటిరోజే కొద్దిగా జ్వరం వస్తుంది.  మూడోరోజు నుంచి దగ్గు, గొంతు నొప్పి ప్రారంభమవుతుంది. ముక్కు, గొంతు ద్వారా శ్వాసకోశ సమస్యల లక్షణాలు కనిపిస్తాయి. 
  • 4 నుంచి 9 రోజుల్లో.. శరీరంలోని కొవిడ్‌-19 వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఆ తర్వాత శ్వాస తీసుకొనేందుకు చాలా కష్టమవుతుంది. 
  • 8-15 రోజులు.. వ్యాధిగ్రస్థుడి ఊపిరితిత్తులు వాచి తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఈ లక్షణాలున్నవారు ఐసీయూలో చేరి వైద్యసేవలు పొందాల్సి ఉంటుంది. లేదంటే ఊపిరితిత్తుల్లో ఉన్న వైరస్‌ రక్తంలోకి చేరుతుంది. వారం ముగిసేసరికి విషతుల్యమై అది ప్రాణాల మీదకొస్తుంది.
  • మూడోవారంలో పరిస్థితి మరింత విషమిస్తుంది.


logo