శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:20:05

సింగరేణి అప్రమత్తం

సింగరేణి అప్రమత్తం

  • కరోనా వైరస్‌ నియంత్రణకు తగిన చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా విజృంభణ నేపథ్యంలో సింగరేణి అప్రమత్తమైంది. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాకు సింగరేణి అత్యవసర సేవలందించాల్సి ఉన్నందున.విధులకు హాజరయ్యే ఉద్యోగులపట్ల ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నది. గనులు, వివిధ శాఖల ప్రవేశ ద్వారాలవద్ద ఉద్యోగులందరికీ తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌, క్యూలైన్‌లో వ్యక్తుల మధ్య దూరం ఉండేలా గుర్తుల ఏర్పాటు, ఇతర ప్రాంతాలనుంచి బంధువులు వస్తే   సమాచారం ఇవ్వడం, వాష్‌రూముల్లో సబ్బులు, శానిటైజర్ల ఏర్పాటు, లిఫ్టుల్లో జాగ్రత్తలు, క్యాంటీన్‌లో సామాజిక దూరాన్ని పాటించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నది.


logo