సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:16:03

రికవరీ రేటు 75% కొత్తగా 2,478 మందికి కరోనా పాజిటివ్‌

రికవరీ రేటు 75% కొత్తగా 2,478 మందికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 16 లక్షలకుపైగా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,35, 884 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. స కాలంలో సరైన చికిత్స అందిస్తుండటంతో వీరి లో 1,02,024 (75% ) మంది కోలుకున్నట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. మరో 32,994 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం 62 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,478 మందికి పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీలో గరిష్ఠంగా 267 కేసులు, కనిష్ఠంగా నారాయణపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లలో 16 చొప్పున కేసులు నమోదయ్యా యి.   

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
గురువారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,478
1,35,884
డిశ్చార్జి
 2,011
1,02,024
మరణాలు
10
866
చికిత్స పొందుతున్నవారు-
32,994
logo