బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 06:56:44

నిమ్స్‌ నుంచి ‘కొవాగ్జిన్‌' వలంటీర్ల డిశ్చార్జి

నిమ్స్‌ నుంచి ‘కొవాగ్జిన్‌' వలంటీర్ల డిశ్చార్జి

హైదరాబాద్ : భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌'ను టీకాను ప్రయోగాత్మకంగా తీసుకున్న ఇద్దరు వలంటీర్లు మంగళవారం నిమ్స్‌ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. వ్యాక్సిన్‌ను ప్రయోగించిన తర్వాత ఆ ఇద్దరిని వైద్యులు 24 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచారు. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించకపోవడంతో మంగళవారం ఇంటికి పంపించారు. మరో 14 రోజులువారు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. రెండువారాల తర్వాత వారిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యాయో లేదో నిర్ధారిస్తారు.


logo