హైదరాబాద్, ఆగస్టు 2: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా డెల్టా ప్లస్ వేరియంట్‌పై కూడా సమర్థంగా పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు వేసుకొన్నవారిలో డెల్టా ప్లస్‌ను నిలువరించగల ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతున్నట్టు తేలింది. ఈ టీకా డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే.