సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 01:59:47

కోర్టు నోఅంటే పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు!

కోర్టు నోఅంటే పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై నమోదైన పిటిషన్‌పై అధికారులు ఇచ్చే సమాధానంతో హైకోర్టు సంతృప్తి చెందకపోతే పాతపద్ధతినే అవలంబించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నవంబర్‌ 23న ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ధరణి పోర్టల్‌ వల్ల ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల డబుల్‌ రిజిస్ట్రేషన్‌కు చెక్‌ పడుతుంది. ఈ ప్రక్రియ అమలులోకి రావడం ఇష్టంలేని కొందరు కోర్టును ఆశ్రయించడంతో విచారణ కోసం హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించి వాదనలు వింటున్నది. తదుపరి విచారణను గురువారానికి (డిసెంబర్‌ 3) వాయిదావేసింది. అధికారులు వివరించే భద్రతా చర్యలపై కోర్టు సంతృప్తి చెంది అనుమతిస్తే ధరణిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. ఒకవేళ అధికారులు ఇచ్చే సమాధానంపై న్యాయస్థానం సంతృప్తి చెందకపోతే.. ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.