ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 18:01:09

మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్, దొంగతనం కేసు నమోదుకు కోర్టు ఆదేశం

మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్, దొంగతనం కేసు నమోదుకు కోర్టు ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లందు : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఉకే అబ్బయ్య తనను మోసం చేసి తన కారును దొంగలించి బెదిరిస్తున్నాడని, టేకులపల్లి నివాసి చిప్పా రాంప్రసాద్ ఇల్లందు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో న్యాయవాది  యుగంధర్  ద్వారా ప్రవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం ఐపీసీ సెక్షన్ 379, 420, 294 (B) 403, 407, 506 ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఇల్లందు పోలీస్‌ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేసింది.