మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Aug 20, 2020 , 13:07:21

కరోనా బాధితుల్లో ధైర్యం నింపాలి : ఎంపీ కవిత

కరోనా బాధితుల్లో ధైర్యం నింపాలి : ఎంపీ కవిత

మహబూబాబాద్ : కరోనా వైరస్ సోకిన వారిలో మానసికధైర్యం నింపాలని.. అది వారు త్వరగా కోలుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కరోనా సోకిన వారి పట్ల కరుణతో వ్యవహరించాలన్నారు. సుమారు ఎనిమిది లక్షల రూపాయల తన సొంత ఖర్చుతో తెప్పించిన పండ్ల రసాల ప్యాకెట్లను పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంపీ కవిత పంపిణీ చేస్తున్నారు.

ఇందులో భాగంగా తన తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ జన్మదినం సందర్భంగా జిల్లాలోని కురవి మండలంలో కరోనా బాధితులకోసం పండ్ల రసాల ప్యాకెట్ల పంపిణీ చేశారు. స్థానిక ఆరోగ్య సిబ్బందికి ప్యాకెట్లను అందజేసి బాధితులకు ఇవ్వాల్సిందిగా ఎంపీ సూచించారు.