బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 01:37:30

రోడ్డుప్రమాదంలో దంపతుల దుర్మరణం

రోడ్డుప్రమాదంలో దంపతుల దుర్మరణం

  • అనాథలుగా మారిన నలుగురు పిల్లలు

ఎల్లారెడ్డి, నమస్తేతెలంగాణ/సదాశివనగర్‌: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందడంతో వారి నలుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం లింగంపల్లి గేటు సమీపంలో మంగళవారం చోటుచేసుకున్నది. గాంధారి మండలం పోతంగల్‌కలాన్‌కు చెంది న గంగిరెద్దుల సాయిలు(35), సావిత్రి(30) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు మంగళవారం చిన్నకొడుకు రాజు(1), చిన్న కూతురు హర్షిత(2)తో బైక్‌పై జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ దవాఖానకు వెళ్లారు. 


రెండురోజుల తరువాత రావాలని వైద్యసిబ్బంది సూచించడం తో వారు వెనుదిరిగారు. ఇంటికి వెళ్తున్న  క్రమంలో గాంధారి ఎక్స్‌రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్‌ వీరిని ఢీకొట్టగా.. సాయిలు, సావిత్రి అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులు హర్షిత, రాజు కింద పడిపోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. సాయిలు పెద్ద కూతురు సునీత(11), పెద్ద కుమారుడు సందీప్‌(8) చదువుకుంటున్నారు. పోలీసులు వ్యాన్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. logo