గురువారం 04 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:07

మాచారెడ్డిలో జంట ఆత్మహత్య

మాచారెడ్డిలో జంట ఆత్మహత్య

మాచారెడ్డి:  తమ వివాహేతర సంబంధం వెలుగులోకి రావడం తో ఓ జంట ఉరేసుకొని ఆత్మహ త్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో శనివారం చోటుచేసుకున్నది.  గ్రామంలోని వేర్వేరు కుటుంబాలకు చెందిన ఈరం బాల్‌నర్సు(38), ఎర్రోళ్ల ప్రేమలత(35) పరిచయస్థులు. వీరికి వేర్వేరుగా వివాహాలయ్యాయి. బాల్‌నర్సుకు ఇద్దరు కుమారులు కాగా ప్రేమలతకు కుమారుడు ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఆరు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. విషయం ఇంట్లో తెలియడంతో శనివారం గ్రామ శివారులోని బాల్‌నర్సు పొలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  


logo