శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 16:15:26

హోం క్వారంటైన్‌ వీడి బయటకు వచ్చిన దంపతులు

హోం క్వారంటైన్‌ వీడి బయటకు వచ్చిన దంపతులు

హైదరాబాద్‌ : కరీంనగర్‌లో దంపతులు హోం క్వారంటైన్‌ వీడి బయటకు వచ్చారు. దంపతులు ఈ నెల 7న అమెరికా నుంచి కరీంనగర్‌కు వచ్చారు. అధికారుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా ఇవాళ వీరు గృహ నిర్బంధాన్ని వీడి జగిత్యాలలో బంధువుల ఇంటిలో సంవత్సరీకానికి హాజరైయ్యారు. సమాచారం తెలిసిన అధికారులు వెంటనే స్పందించి దంపతులను అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించారు. జగిత్యాల ఆర్డీవో నరేందర్‌, సీఐ జయేష్‌రెడ్డి అప్రమత్తమైయ్యారు. విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చిన వారు విధిగా గృహ నిర్బంధాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది. లేనియెడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం తెలిసిందే.


logo