సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 13:01:53

కామారెడ్డిలో క‌రోనాతో భార్యాభ‌ర్త‌ల మృతి

కామారెడ్డిలో క‌రోనాతో భార్యాభ‌ర్త‌ల మృతి

కామారెడ్డి: ‌క‌రోనాతో వారం రోజుల వ్య‌వ‌ధిలో భార్యాభ‌ర్త‌లు మృతిచెందిన ఘ‌ట‌న కామారెడ్డి ప‌ట్ట‌ణంలో చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణంలోని పంచముఖ హనుమాన్‌ కాలనీకి చెందిన రాజేష్ (35) అనే యువకుడు‌, అత‌ని భార్యకు క‌రోనా వైర‌స్ సోకింది. హోం క్వారంటెన్‌లో ఉన్న రాజేష్ ఈ నెల 7న బాత్ రూమ్‌లో జారిపడి మృతి చెందాడు. గాంధీ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న అతని భార్య గురువారం మృతి చెందింది. 

మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అందులో పాటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.  అదేవిధంగా మృతుడి అంత్యక్రియలకు హాజరైన ఆరుగురు కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో రాజేష్ అంత్యక్రియలకు హాజరైనవారికి వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. 


logo