మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 21:26:22

మాస్కులతో పెళ్లి వేడుకలు

మాస్కులతో పెళ్లి వేడుకలు

మెట్‌పల్లి టౌన్‌: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. దీని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని అటు ప్రభుత్వం, ఇటు వైద్యులు సూచించడం జరుగుతున్నది. ఇటీవల పట్టణానికి చెందిన బెజ్జారపు ప్రవీణ్‌-లక్ష్మీకి పెళ్లి సంబంధం కుదిరింది. ఈ నెల 20న పెళ్లి నిశ్చమైంది. కరోనా వైరస్‌ విస్త్రృతమవుతున్న క్రమంలో వైద్యుల సూచనలను పరిగణలోకి తీసుకున్న ప్రవీణ్‌ ఆచరణలో పెట్టారు.  

తమ పెళ్లికి మాస్కులతో రండి అంటూ ప్రవీణ్‌ తన బంధు మిత్రులకు పెళ్లి పత్రికతో పాటు మాస్కును పంపిణీ చేసి ఆహ్వానించారు. శుక్రవారం పట్టణంలోని లిమ్రా ఫంక్షన్‌ హాల్‌లో ఈ వివాహం జరిగింది. వధువరులతో పాటు పురోహితుడు, బంధు మిత్రులు, ప్రతి ఒక్కరూ మాస్కులతో పెళ్లి వేడుకలో పాల్గొనడం అబ్బురపరిచింది. మాస్కులతోనే పెళ్లి వేడుకలకు సంబంధించి కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం విశేషం.   


logo
>>>>>>