సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 07:31:14

బాలికపై దంపతుల దాడి...

బాలికపై దంపతుల దాడి...

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలికపై దంపతులు దాడి చేశారు. ఇంట్లో సరిగా పనిచేయడం లేదన్న సాకుతో విచక్షణ రహితంగా కొట్టారు. స్థానికు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించి ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఇద్దరూ ఇండియాన్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. బాలిక కొంతకాలంగా ఈ దంపతుల వద్ద పనిచేస్తుంది. బాలిక స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా గుడికమలాపూర్‌. 


logo