గురువారం 02 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:39:05

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ

  • గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

కొండాపూర్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశంలో సరికొత్త ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాదాపూర్‌లో ని శ్రీ వెంకటేశ్వర గ్రూప్‌ ఆఫ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన పీవీ మ్యూజియాన్ని  వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమంలో సురభి వాణిదేవి, పీవీ ప్రభాకర్‌, అజితశేఖర్‌, ఎన్వీ సుభాష్‌, ప్రొఫెసర్‌ సీతారామరావు పాల్గొన్నారు.

పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడినపెట్టారని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆదివారం సిమ్లాలోని రాజ్‌భవన్‌లో పీవీ చిత్రపటానికి దత్తాత్రే య నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీవీ శతజయంతి వేడుకలను ఏడాదిపాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  


ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో..

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ చిత్రపటానికి  భవన్‌ ఓఎస్డీ సయ్యద్‌ అలీ మూర్తజా రిజ్వీ, రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలుస్తారు

  • శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర


దేశానికి వన్నెతెచ్చిన పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  పీవీ గొప్ప ఆర్థికవేత్త మాత్రమే కాదు.. ఆధ్యాత్మికవేత్త కూడా అని పేర్కొన్నారు. తెలుగువారి కీర్తిని పెంచిన పీవీ శతజయంతిని ఏడాదిపాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమన్నారు. విశాఖ శారదాపీఠం అంటే పీవీకి ఎంతో మక్కువని, గతంలో శారదా పీఠాన్ని పలుమార్లు సందర్శించారని గుర్తుచేశారు. పీవీ స్వగ్రామం వంగర శివాలయంలో చేపట్టిన విగ్రహ ప్రతిష్ఠ తన చేతులమీదుగా చేయించారని పేర్కొన్నారు.

పీవీ సేవలు చిరస్మరణీయం: మాజీ ఎంపీ కవిత

ఖలీల్‌వాడి: పీవీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన తెలంగాణ బిడ్డ, భారతజాతి ఆణిముత్యం, బహుభాషా కోవిదుడు పీవీ అని ఆమె కొనియాడారు. 

దేశదేశాల్లో పీవీ శత జయంతి వేడుకలు

పీవీ శతజయంతి వేడుకలను వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. జర్మనీలో ఉన్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదివారం బెర్లిన్‌లో పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌, సిడ్నీ, కాన్‌బెర్రా, అడిలైడ్‌, బ్రిస్బెన్‌, లండన్‌, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌, న్యూజిలాండ్‌, డెన్మా ర్క్‌, లాట్వియాలలో పీవీకి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ఎన్నారై అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి, విక్టోరియా ఇంచార్జి ఉప్పు సాయిరామ్‌, టాక్‌ అధ్యక్షురాలు పవిత్ర, మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు తిరుపతి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై  అధ్యక్షుడు చిట్టిబాబు, న్యూజిలాండ్‌ తెలుగు సంఘం అధ్యక్షురాలు శ్రీలత, టీఆర్‌ఎస్‌ ఎన్నారైశాఖ అధ్యక్షుడు విజయ్‌ భాస్కర్‌రెడ్డి, డెన్మార్క్‌ తెలంగాణ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు శ్యాంబాబు, తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌ అధ్యక్షుడు రాజుకుమార్‌, టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ నాయకులు జయచందర్‌ గంట, ప్రసాద్‌రావు కల్వకుంట్ల, తెలంగాణ జాగృతి డెన్మార్క్‌ అధ్యక్షుడు బీ సంతోష్‌రావు, బహరెన్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నారై అధ్యక్షుడు సతీశ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo