గురువారం 09 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:17

కరెంట్‌ బిల్లులపై సందేహాల నివృత్తి

కరెంట్‌ బిల్లులపై సందేహాల నివృత్తి

  • విద్యుత్‌ కార్యాలయాల వద్ద కౌంటర్లు
  • ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తాజాగా వచ్చిన విద్యుత్‌ బిల్లులపై ఎలాంటి సందేహాలున్నా వినియోగదారులు సంస్థ దృష్టికి తీసుకొనిరావాలని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ బిల్లులు అధికంగా వచ్చాయని కొందరు ఆందోళన చెందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే సందేహాల నివృత్తికి చర్యలు చేపట్టామన్నారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని ఈఆర్వో ఆఫీసుల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశామన్నారు. అదేవిధంగా [email protected] tssouthernpower.com, [email protected], [email protected] తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రెండు రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  


logo