ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 17:15:10

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పులు

భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం మండలం మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు పక్కనే ఉన్న దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. ఈ ఎదురు కాల్పుల్లో స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ నరసింహారావుకు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన ఒక పెపన్‌తో పాటు 13 కిట్లు, మందుపాతర సామగ్రి, రేషన్ సరుకులు, ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్‌ దత్ వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo