హైదరాబాద్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో స్టాప్ నర్సుల నియామకానికి ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ రేపటి(గురువారం) నుండి ప్రారంభం కానుంది. ఎంపికైన 803 మంది అభ్యర్థుల కౌన్సెలింగ్ జూన్ 16 నుండి 19 వరకు నగరంలోని కోఠిలో గల ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరుగనున్నట్లు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ కె.రమేష్ రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ వెబ్సైట్ https://vvp.telangana.gov.in లో అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.