శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 13:47:05

హ్యాపీ న్యూ ఇయ‌ర్ : మ‌ండ‌లి చైర్మ‌న్ గుత్తా

హ్యాపీ న్యూ ఇయ‌ర్ : మ‌ండ‌లి చైర్మ‌న్ గుత్తా

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ‌జేశారు. నూతన సంవత్సరం 2021లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. గత సంవత్సరం 2020 మిగిల్చిన చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకొని, నూతన సంవత్సరములో తగు జాగ్రత్తలు పాటిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాల‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రములోని యువత ,అన్ని సమస్యలను అధిగమించి  తాము పెట్టుకున్న లక్ష్యాలను సాధించి, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను అని వెల్ల‌డించారు. 2021 సంవత్సరం అందరికి కలిసి రావాలని ఆ భగవంతున్నీ ప్రార్థిస్తున్నాను అని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు.


logo