గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 00:43:01

నేటినుంచి పత్తి కొనుగోళ్లు

నేటినుంచి పత్తి కొనుగోళ్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌శాఖ సమాయత్తమైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం కొనుగోళ్లను ప్రారంభించనున్నది. నవంబర్‌ మొదటివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు 300 జిన్నింగ్‌ మిల్లుల్లో, తొమ్మిది మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ ఏడాది 59.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా.. 54 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. ఈ క్రమంలో పత్తి కొనుగోళ్లకు పక్కాగా చర్యలు తీసుకుంటున్నట్టు మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తెలిపారు.