బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 18:05:53

కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ రూ. 35 లక్షలు అందజేత

కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ రూ. 35 లక్షలు అందజేత

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఏ ఒక్కరు ఆకలితో అలమటించొద్దన్న ఆశయంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ చర్యలకు మద్దతుగా పలువురు పారిశ్రామికవేత్తలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతూ సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సీఎంఆర్‌ఎఫ్‌కు తమ వంతూ చేయూతను అందించింది. అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సమక్షంలో రూ. 35 లక్షల విరాళాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేశారు.


logo