బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:26:37

లక్ష్యం దిశగా పత్తిసాగు

లక్ష్యం దిశగా పత్తిసాగు

  • 53.64 లక్షల ఎకరాల్లో దూదిపూల సేద్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో పంటలసాగు జోరు కొనసాగుతున్నది. 86.45 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. గతేడాది కంటే ఇది 15.19 లక్షల ఎకరాల్లో పంటలు అధికమని వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు పంటలసాగు నివేదిక ప్రభుత్వానికి అందించింది. ప్రభు త్వం ప్రతిపాదించిన నియంత్రిత వ్యవసాయానికి అనుగుణంగానే రైతులు పంటలను సాగుచేస్తున్నట్టు పేర్కొన్నది. ఇప్పటివరకు 53.64 లక్షల ఎకరాల్లో పత్తి పంట పూర్తయ్యింది. గతేడాది ఇప్పటివరకు 40.69 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మరో 82 వేల ఎకరాల్లో సాగయితే గతేడాది 54.46 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని దాటనున్నది. ఈ సీజన్‌లో 60.16 లక్షల ఎకరాల్లో పత్తివేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 8.13 లక్షల ఎకరాల్లో కంది పంట పూర్తికాగా.. వరినాట్లు జోరందుకున్నాయి. 15.13 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 7.04 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. సాయాబీన్‌ 3.87 లక్షలు, పెసర్లు 1.16 లక్షలు, జొన్న 1.08 లక్షల ఎకరాల్లో సాగైంది. 19 జిల్లాల్లో 80 శాతానికిపైగా పంటలు పూర్తయ్యాయి. కుమ్రంభీంఆసిఫాబాద్‌ (116 శాతం), ఆదిలాబాద్‌ (111 శాతం), నారాయణపేటలో(109 శాతం) ఇప్పటికే లక్ష్యం పూర్తయ్యింది. వరుస వర్షాలు పంటలకు ఎంతో సహకరిస్తున్నాయి.  


logo