మంగళవారం 14 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:37:20

ఖమ్మంలో ‘పత్తి’ ప్రభంజనం

ఖమ్మంలో ‘పత్తి’ ప్రభంజనం

  • ఇప్పటివరకు లక్ష ఎకరాల్లో సాగు

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో లక్ష ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. సీఎం కేసీఆర్‌ సూచించిన మేరకు నియంత్రిత సాగులో భాగంగా అన్నదాతలు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వానకాలంలో సాధారణం గా 2,43,537 ఎకరాల్లో పత్తి సాగు చేయా ల్సి ఉన్నది. పక్షం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే 21 మండలాల పరిధిలో 1,06,609 ఎకరాల్లో రైతులు పత్తి విత్తారు. నిరుడు ఇదే సమయానికి కేవలం 15 వేల ఎకరాల్లోనే సాగైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో మంగళవారం వరకు అన్నిరకాల పంటలు కలిపి 1,20,118 ఎకరాల్లో సాగయ్యాయి. మక్కజొన్న సాగు లేకపోవడంతో ఆ స్థానంలో కంది, పత్తికి ప్రాధాన్యమిస్తున్నారు. logo