శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 15:46:41

అవినీతికి పాల్పడ్డ వెటర్నరీ అసిస్టెంట్ సస్పెన్షన్

అవినీతికి పాల్పడ్డ వెటర్నరీ అసిస్టెంట్ సస్పెన్షన్

వికారాబాద్ : రైతుల నుంచి డబ్బులు వసూలు చేసిన వెటర్నరీ అసిస్టెంట్ పై వేటు పడింది. జిల్లాలోని బొం రాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామ వెటర్నరీ అసిస్టెంట్ (V. A) శేఖర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రకటించారు. బొం రాస్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో తలసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందు కోసం తమ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు  రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి శేఖర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం యాదవ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. logo