మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 01:36:09

ఏసీబీకి చిక్కిన అధికారులు

ఏసీబీకి చిక్కిన అధికారులు

భద్రాచలం, నమస్తే తెలంగాణ/కోనరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మం డలంలో అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ డైరెక్టర్‌గా పని చేసిన బొల్లుమల్లు నారాయణ 2008లో పదవీ విరమణ పొందారు. ప్రొహిబిషన్‌ పీరియడ్‌ కన్ఫర్మ్‌ కాకపోవడంతో పెన్షన్‌ రావడం లేదు. పెన్షన్‌ సెటిల్‌ చేసేందుకు నారాయణను భద్రాచలం సహాయ కోశాధికారి కార్యాలయం లో పనిచేస్తున్న ఎస్టీవో సైదులు, సీనియర్‌ అకౌంటెంట్‌ వెంకటేశ్వర్లు రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేశారు. గురువారం భద్రాచలం కరకట్ట సమీపంలో బాధితుని నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా సీనియర్‌ అకౌంటెంట్‌ వెంకటేశ్వర్లును పట్టుకున్నారు. ఆయన ద్వారా డబ్బులు అడిగిన ఎస్టీవో సైదులును కూడా అదుపులోకి తీసుకున్నారు.


కోనరావుపేటలో పంచాయతీ కార్యదర్శి..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్‌ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌ ఏసీబీకి చిక్కాడు. ఎగ్లాస్‌పూర్‌కు చెందిన స్వామిగౌడ్‌ ఇంటి నిర్మాణ అనుమతి కోసం 2019 ఆగస్టులో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌ను కలిశాడు. అందుకు తనకు రూ.5 వేలు ఇవ్వాలని స్వామిగౌడ్‌ను డిమాండ్‌ చేశాడు. గురువారం  బాధితుడి నుంచి ప్రవీణ్‌ రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


logo
>>>>>>