మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 12:26:51

నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఏరియా హాస్పిటల్‌లో నూతనంగా కొవిడ్‌ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు హాస్పిటల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.  అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి ఎమ్మెల్యే శంకర్ నాయక్  బహూకరించిన అంబులెన్స్ ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.